: ఆరు రోజులు మూతపడనున్న పెట్రోల్ బంకులు
వాహనదారులకు పెట్రోల్ బంకులు షాక్ ఇచ్చాయి. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ వచ్చే నెలలో దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. 2012లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించాయి. పబ్లిక్ హాలిడేలు, సెలవు దినాల్లో బంకులు తెరవకూడదనే నిర్ణయానికి వచ్చాయి. ఈ నేపథ్యంలో, మొత్తం ఆరు రోజుల పాటు పెట్రోల్ బంకులు మూతపడే అవకాశం కనిపిస్తోంది.