: విజయవాడలో టీటీడీపీ నేతలు రేవంత్ రెడ్డి, రమణ
తెలుగుదేశం పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎల్.రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిలు విజయవాడకు వెళ్లారు. తమ అధినేత చంద్రబాబును కలిసేందుకు వారు విజయవాడ చేరుకున్నారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతున్న విషయాలను తమ అధినేతకు వారు వివరించనున్నట్టు సమాచారం.