: కోహ్లీకి వ్యతిరేకంగా ఆడాల్సి వస్తే దూకుడుగా ఉండక తప్పదు: గంభీర్
టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ తెలిపాడు. ఐపీఎల్ మ్యాచ్ లో కోహ్లీతో కావాలని గొడవ పడలేదని... కోహ్లీకి వ్యతిరేకంగా ఆడాల్సి వచ్చినప్పుడు దూకుడు తప్పదని చెప్పాడు. తామిద్దరి భావోద్వేగాలు ఒకేలా ఉంటాయని తెలిపాడు. క్రికెట్ అంటేనే సీరియస్ గేమ్ అని... ఆడేటప్పుడు దూకుడుగా ఉండక తప్పదని చెప్పాడు. తమిద్దరికీ క్రికెట్ అంటే ఎంతో ఇష్టమని... ఇద్దరం ఒకే జట్టులో ఉంటే విజయం మాత్రమే తమ లక్ష్యంగా ఉంటుందని అన్నాడు. రెండేళ్ల తర్వాత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన గంభీర్... కోహ్లీ కెప్టెన్సీలో తొలి టెస్ట్ ఆడాడు. దీనికి సంబంధించి గంభీర్ మాట్లాడుతూ, కోహ్లీ కెప్టెన్సీ అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు.