: చంద్రబాబు అమెరికా పర్యటన వాయిదా


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి అమెరికా పర్యటన వాయిదా పడింది. ఫిబ్రవరిలో ఆయన అమెరికా వెళ్లే అవకాశం ఉంది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో ఆయన 9 రోజుల పాటు అమెరికాలో పర్యటించాల్సి ఉంది. ముఖ్యమంత్రి యూఎస్ వెళ్లాలనుకున్న సమయంలో రాష్ట్రంలో ముఖ్యమైన కార్యక్రమాలు ఉండటంతో పర్యటన వాయిదా పడిందని ప్రభుత్వ ఎన్ఆర్ఐ వ్యవహారాల సలహాదారుడు రవికుమార్ తెలిపారు. తొలుత వారం కానీ లేదా పది రోజులు కానీ వాయిదా వేయాలని అనుకున్నామని... అయితే, అమెరికాలో ఆ సమయంలో థ్యాంక్స్ గివింగ్ డే, ఆపై క్రిస్మస్ సెలవులు వస్తుండటంతో పాటు, జనవరిలో విశాఖలో పెట్టుబడుల సదస్సు జరగనుండటంతో సీఎం పర్యటనను ఫిబ్రవరికి వాయిదా వేశామని ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News