: నేడు తొలిసారిగా ఏపీ టీడీపీ కార్యాలయానికి చంద్రబాబు.. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు తొలిసారిగా ఏపీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టనున్నారు. రాష్ట్ర విభజన తర్వాత గుంటూరులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే సీఎం ఇప్పటి వరకు కార్యాలయాన్ని సందర్శించలేదు. బుధవారం తొలిసారిగా కార్యాలయానికి రానున్న చంద్రబాబు కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.