: సౌదీ యువరాజుకు ఉరి.. హత్య కేసులో శిక్ష అమలు


హత్య కేసులో నిందితుడైన సౌదీ యువరాజు టర్కిబిన్ సౌద్ అల్ కబీర్‌కు మంగళవారం రియాద్‌లో ఉరి శిక్ష అమలు చేశారు. అదెల్ అల్ మహ్మద్ అనే వ్యక్తిని కాల్చి చంపిన ఘటనలో ఆయన ఉరిశిక్షకు గురయ్యారు. రాజు ఉరితీతతో ఈ ఏడాది సౌదీలో మరణశిక్షకు గురైన వారి సంఖ్య ఏకంగా 134కు చేరుకుంది. 2012లో మిత్రుడైన అదెల్‌తో గొడవపడిన యువరాజు కబీర్ ఆగ్రహంతో అతడిని కాల్చి చంపాడు. ఈ కేసులో అతడు దోషిగా తేలడంతో ప్రభుత్వం యువరాజుకు మరణశిక్ష విధించింది. మంగళవారం ఉరిశిక్ష అమలు చేసింది. ఓ యువరాజును ఉరితీయడం ఇప్పుడు సౌదీలో సంచలనంగా మారింది.

  • Loading...

More Telugu News