: ఆరో తరగతి కుర్రాడి అద్భుత ఆలోచన.. అబ్దుల్ కలాం అవార్డుకు ఎంపిక


ఆరోతరగతి చదువుతున్న విద్యార్థి అద్భుత ఆలోచన అతడికి అబ్దుల్ కలాం అవార్డును తెచ్చిపెట్టింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరిగే ఎన్నికలను అడ్డుకునేందుకు మావోయిస్టులు పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలు ఎత్తుకెళ్తుండడం సర్వసాధారణమే. ఈ విషయాలను వార్తల ద్వారా తెలుసుకున్న చత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన సుఖ్మాలో నివసిస్తున్న రోషన్ సోరీ(13)కు ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనను ఎన్నికల కమిషన్‌తో పంచుకున్నాడు. అద్భుతమైన రోషన్‌ ఆలోచనకు ఎలక్షన్ కమిషన్ అబ్బురపడింది. ఈవీఎంలో ఓటు వేయగానే అది సంబంధిత అధికారుల వద్ద ఉన్న ఓ సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తమైతే ఈవీఎంలను ఎత్తుకెళ్లినా ఎటువంటి ఇబ్బంది ఉండదనేదే ఆ ఆలోచన. ఆరోతరగతి చదువుతున్న రోషన్ ఐడియాను మెచ్చిన అధికారులు ఈ ఏడాది అబ్దుల్ కలాం ఇగ్నైట్ అవార్డుకు ఎంపిక చేశారు. గత బుధవారమే రోషన్‌కు కలెక్టర్ అవార్డు అందజేశారు.

  • Loading...

More Telugu News