: కాంగ్రెస్ నేత చిదంబరాన్ని హతమారుస్తామంటూ ట్విట్టర్ ద్వారా బెదిరింపు


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరాన్ని హతమారుస్తామంటూ బెదిరింపు వచ్చింది. రాజగోపాలన్ సుబ్రమణ్యన్ అనే వ్యక్తి పేరిట ఉన్న ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ నెల 16వ తేదీన బెదిరింపు వచ్చిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో చెన్నై పోలీస్ కమిషనర్ కు కాంగ్రెస్ నేత అరుళ్ పెత్తయ్య ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తామని, నిందితుడిపై తగు చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. కాగా, ‘ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చిదంబరాన్ని, అతని కుటుంబాన్ని హతమార్చడమే ఉత్తమం’ అని ఆ బెదిరింపు ట్వీట్ లో ఉన్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News