: కశ్మీర్లో ఉగ్రవాద స్థావరం గుట్టు రట్టు... సైనికుల అదుపులో 44 మంది!


జమ్మూకశ్మీర్ లో పాక్ ఉగ్రమూకలకు చెందిన ఒక స్థావరాన్ని భద్రతా దళాలు గుర్తించాయి. గాలింపు చర్యలలో భాగంగా పాత బారాముల్లా ప్రాంతంలో భద్రతా దళాలు గాలిస్తుండగా ఈ ఉగ్రవాద స్థావరం వారి కంటబడింది. ఈ స్థావరం నుంచి భారీ ఎత్తున బాంబులు, జైషే మహ్మద్, లష్కరే తోయిబాలకు చెందిన లెటర్ హెడ్ లను కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అక్కడి నుంచే కశ్మీర్ లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించి వివిధ ప్రణాళికలను రచించినట్టు దొరికిన పత్రాలను బట్టి వెల్లడైంది. అంతే కాకుండా పాకిస్తాన్, చైనాలకు చెందిన జాతీయ జెండాలు కూడా లభ్యమయ్యాయి. దీంతో గాలింపు చేపట్టిన భద్రతా దళాలు మొత్తం 44 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి.

  • Loading...

More Telugu News