: రెండో వన్డేకు కూడా దూరమైన రైనా
ఢిల్లీ వేదికగా న్యూజిలాండ్ తో జరగనున్న రెండో వన్డేకు టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మన్ సురేష్ రైనా దూరమయ్యాడు. గత కొంత కాలంగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సురేష్ రైనా తొలి వన్డేకు కూడా దూరమైన సంగతి తెలిసిందే. జ్వరం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో మరికొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో గురువారం (ఈ నెల 20న) జరగనున్న వన్డేకు రైనా అందుబాటులో ఉండటం లేదు.