: డీఎస్పీగా రెజ్లర్ గీతా ఫొగట్.. హర్యానా ప్రభుత్వం నిర్ణయం


మన దేశానికి అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టిన అర్జున్ అవార్డు గ్రహీత, రెజ్లర్ గీతా ఫొగట్ ను హర్యానా ప్రభుత్వం తగు రీతిలో గౌరవించింది. పోలీసు డిపార్ట్ మెంటులో డీఎస్పీగా ఆమెను నియమించింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రతిపాదన చేసింది. సీఎం మనోహర్ లాల్ కట్టర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనను ఆమోదించినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, స్పోర్ట్స్ కోటా కింద పర్వతారోహకుడు లామ్ లాలాను ఎస్సైగా నియమిస్తూ హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, ఢిల్లీలో 2010లో నిర్వహించిన కామన్ వెల్త్ క్రీడల్లో గీతా ఫొగట్ స్వర్ణ పతకం సాధించింది.

  • Loading...

More Telugu News