: చిరంజీవి బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ ఆయనకే సొంతం!: నిర్మాత వెంకటేశ్వరరావు
‘రౌడీ అల్లుడు’ సిినిమాలో చిరంజీవి బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్ ఆయన చేసిన సొంత ప్రయత్నమేనని, ఆ విధంగా చేయడం మెగాస్టార్ కి తప్ప మరెవరికీ సాధ్యం కాదని అన్నారు ఆ చిత్ర నిర్మాత, చిరంజీవి తోడల్లుడు అయిన వెంకటేశ్వరరావు. ‘రౌడీ అల్లుడు’ సిినిమా విడుదలై ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ చిత్రంలో చిరంజీవి డ్యుయల్ రోల్ లో చాలా అద్భుతంగా నటించారని, ముఖ్యంగా ఆటోజానీ పాత్రలో చిరంజీవి నటన, ఆయన పండించిన కామెడీని మరువలేమన్నారు. తాను నిర్మాతగా మారడానికి కారణం అల్లు అరవింద్ చూపించిన ప్రోత్సాహమేనని అన్నారు. చిరంజీవితో సినిమాలు తీసే అవకాశం కల్పించింది కూడా అల్లు అరవిందేనని ఈ సందర్భంగా చెప్పారు.