: డ్వెన్ బ్రావోతో డేటింగ్ చేయడం లేదు: శ్రియ
వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వెన్ బ్రావోతో తాను డేటింగ్ చేస్తున్నానంటూ వచ్చిన వార్తలపై ప్రముఖ నటి శ్రియ శరణ్ వివరణ ఇచ్చింది. ప్రస్తుతం సింగిల్ గా ఉన్నానని స్పష్టం చేసిన శ్రియ, ఇలాగే సంతోషంగా ఉన్నానని తెలిపింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని, లంచ్ కోసమే రెస్టారెంట్‌కు వెళ్లానని చెప్పింది. బ్రావోతో డేటింగ్ వార్తలను ఖండించింది. కాగా, వారిద్దరూ కలిసి రెస్టారెంట్ నుంచి బయటకు వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేయగా, బాలీవుడ్ లోని పలు పత్రికల్లో వార్తలు వెల్లువెత్తాయి.