: పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ తో వేర్పాటువాద హురియత్ నేత భేటీ


భారత్ లోని పాకిస్థాన్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్‌ తో కశ్మీర్ కు చెందిన ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ నేత అఘా సయ్యద్ హసన్ అల్ మూస్వి సమావేశమయ్యారు. ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయానికి వచ్చిన సయ్యద్ హసన్ అల్ మూస్వి, బాసిత్ ను కలిశారు. ఈ సందర్భంగా కశ్మీర్‌ లో నెలకొన్న తాజా పరిస్థితిపై చర్చించారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ కు నిరసనగా కశ్మీర్ లో వేర్పాటు వాదులు మూడు నెలలపాటు ఆందోళనలు రేపారు. దీంతో కశ్మీరీలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలతో ప్రభుత్వం భద్రతా బలగాలను మోహరించి, ఆందోళనలను చల్లార్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News