: జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడి భార్య ఆత్మహత్య
జాతీయస్థాయి కబడ్డీ క్రీడాకారుడు రోహిత్ కుమార్ భార్య ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమ ఢిల్లీ నాన్ గోలాయిలోని రోహిత్ కుమార్ నివాసంలో ఆయన భార్య లలిత (27) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు చెప్పారు. కాగా, సుమారు 6 నెలల క్రితం రోహిత్-లలిత వివాహం జరిగింది. ప్రోకబడ్డీ లీగ్ పట్నా పైరేట్స్ జట్టు సభ్యుడిగా రోహిత్ ఉన్నాడు.