: తమ్ముడి ప్రాణం కోసం కడుపులో బిడ్డను త్యాగం చేసిన మహిళ


తమ్ముడి కోసం కడుపులో బిడ్డను త్యాగం చేసిన మహిళ ఉదంతం చైనాలో ఆసక్తి రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే... చైనాలోని హంగుహు పట్టణానికి చెందిన యంగ్‌ లీ(24) సోదరుడు యంగ్ జున్ అరుదైన ‘బోన్ మారో’ వ్యాధితో బాధపడుతున్నాడు. బోన్‌ మారో వేరొకరి నుంచి తీసుకుంటే కానీ యంగ్‌ జున్ బతకలేడని అతనికి చికిత్స చేస్తున్న వైద్యులు స్పష్టం చేశారు. దీంతో అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో యంగ్ లీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ బోన్ మారోను తమ్ముడు యంగ్ జున్ కు ఇచ్చేందుకు నిర్ణయించింది. కడుపులో బిడ్డ బోన్ మారో ఇచ్చే విషయంలో నిర్ణయాన్ని వైద్యులు ఆమె అభీష్టానికే వదిలేశారు. దీంతో ఆమె తన సోదరుడిని బతికించుకునేందుకే మొగ్గుచూపింది. ఇది చైనా మీడియాలో ప్రసారం కావడంతో అక్కడ పెను చర్చకు దారితీసింది. ఆమె నిర్ణయాన్ని అంతా అభినందిస్తుండడం విశేషం. ఇలాంటి సాహసాన్ని ఏ మహిళ చేయలేదని వారు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News