: అమరావతిలో ఏర్పాటు కానున్న తొలి ప్రైవేట్ విద్యాసంస్థ భవనాలకు వచ్చే నెలలో శంకుస్థాపన
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలి ప్రైవేట్ విద్యాసంస్థ ఏర్పాటు కానుంది. తమిళనాడుకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (వీఐటీ)కి శంకుస్థాపన కార్యక్రమం వచ్చే నెల 3వ తేదీన ఐనవోలులో జరనుంది. ఈ నేపథ్యంలో వీఐటీ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. సంస్థ ప్రతినిధులను చంద్రబాబు అభినందించారు. కాగా, శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా పాల్గొననున్నారు.