: ఐశ్వర్య కూతురు ఆ హీరోని చూసి తన తండ్రే అనుకుందట!


అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ ల గారాలపట్టి ఆరాధ్య తన తండ్రి విషయంలో ఒకసారి పొరపాటు పడిందట. అచ్చం తన తండ్రి అభిషేక్ లాగే జాకెట్, క్యాప్ పెట్టుకుని ఉన్న బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్ ని చూసి ఆయన వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకుందని, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుందని ఐశ్వర్యారాయ్ స్వయంగా పేర్కొంది. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ ఫొటో షూట్ స్టోరీలో ఈ విషయాన్ని ఆమె వెల్లడించింది. రణ్ బీర్ ని అంకుల్ లేదా ఆర్కే అని తన కూతురు పిలుస్తూ ఉంటుందని కూడా ఐశ్వర్య చెప్పుకొచ్చింది.

  • Loading...

More Telugu News