: హైదరాబాద్‌లోని మియాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో దారుణం.. పెట్రోల్ పోసుకుని ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్‌లోని మియాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఈ రోజు దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలేజీలోనే పెట్రోల్ పోసుకుని ఇంటర్ ఫస్టియర్ విద్యార్థిని సాత్విక ఆత్మహత్య చేసుకుంది. సాత్విక నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన అమ్మాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు సాత్విక మృతదేహాన్ని సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యార్థిని మృతికిగల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నారు. తీవ్రమైన ఒత్తిడితోనే సాత్విక ఆత్మహత్యకు పాల్పడిందని సహ విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.