: 'బాహుబలి' బిజినెస్ రికార్డుని చిరంజీవి సినిమా బద్దలు కొట్టిందా?
తెలుగు సినిమా రేంజ్ ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సినిమా 'బాహుబలి'. కలెక్షన్ల పరంగా కూడా 'బాహుబలి' రికార్డులు క్రియేట్ చేసింది. ఈ రికార్డులు ఇప్పట్లో చెరిగిపోవడం అసాధ్యమనే అందరూ భావించారు. కానీ, 'బాహుబలి' ప్రీ బిజినెస్ రికార్డును చిరంజీవి కొత్త సినిమా 'ఖైదీ నెంబర్ 150' బద్దలు కొట్టిందనే టాక్ ఫిలింనగర్ లో బలంగా వినిపిస్తోంది. ఆంధ్ర రైట్స్ విషయంలో 'బాహుబలి'కి రూ. 30 కోట్లు రాగా... 'ఖైదీ నెంబర్ 150'కి రూ. 32 కోట్లు చెల్లించి రైట్స్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, ఒక్క వైజాగ్ కే రూ. 7.7 కోట్లు చెల్లించారట. అయితే, ఈ విషయానికి సంబంధించి ఇంతవరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.