: కోళ్ల వ్యర్థాలు వాడే రైతులను శిక్షిస్తాం: మంత్రి కామినేని
కోళ్ల వ్యర్థాలు అమ్మే వారు, కొనేవారు, వినియోగించే రైతులు దోషులేనని ఏపీ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. కోళ్ల వ్యర్థాలు వాడే రైతులను శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. మత్స్య రంగంలో అక్రమాలపై ఫిర్యాదుల ఆధారంగా చర్యలు చేపడతామని తెలిపారు. క్యాట్ ఫిష్ పై నిషేధం ఉన్నా, వాటిని పెంచుతున్నారని అన్నారు. కోళ్ల వ్యర్థాలు వాడి క్యాట్ ఫిష్ సాగు చేస్తున్నారని, క్యాట్ ఫిష్ వల్ల లాభాలొచ్చినా, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని కామినేని అన్నారు.