: డూప్ కోహ్లీని చూసి నవ్వుకున్న అసలు కోహ్లీ!


డూప్ కోహ్లీనీ చూసిన క్రికెట్ అభిమానులతో పాటు అసలు కోహ్లీ కూడా ఆశ్చర్యపోయిన సంఘటన ఇటీవల జరిగింది. ఇటీవల ముగిసిన భారత్-న్యూజిలాండ్ మూడో టెస్టు జరుగుతున్న సమయంలో ప్రేక్షకుల మధ్య కోహ్లీ దర్శనమిచ్చాడు. దీంతో, ప్రేక్షకులకు ఏం జరుగుతున్నదో అర్థం కాలేదు. ఆ తర్వాత తెలిసింది అతడు అసలు కోహ్లీ కాదని, అతని పోలికలతో ఉన్న వ్యక్తి అని! అయినప్పటికీ, క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు ఏమాత్రం తగ్గలేదు. డూప్ కోహ్లీని చుట్టుముట్టారు, ఆయనతో సెల్ఫీలు దిగారు. స్టేడియంలోని బిగ్ స్క్రీన్లపై డూప్ కోహ్లీని పదే పదే చూపించడం కూడా జరిగింది. ఈ క్రమంలోనే అసలు కోహ్లీ తన డూప్ ను చూసి నవ్వుతూ మరీ చప్పట్లు కొట్టాడు. కాగా, ఈ సరదా వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

  • Loading...

More Telugu News