: ఇరోమ్ షర్మిల పార్టీ పేరు 'పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్'.. మార్పును తీసుకొస్తామన్న మణిపూర్ ఉక్కుమహిళ
సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (ఏఎఫ్ఎస్పీఏ) తీసేయాలని 16 ఏళ్ల పాటు పోరాడి, ఇటీవల తన దీక్షను విరమించిన మణిపూర్ ఉక్కుమహిళ ఇరోమ్ షర్మిల తాను ప్రకటించినట్లుగానే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందు కోసం అన్నింటినీ సిద్ధం చేసుకుంటున్నారు. 'పీపుల్స్ రీసర్జెన్స్ అండ్ జస్టిస్ అలయెన్స్' పేరుతో కొత్త పార్టీని పెట్టారు. వచ్చే ఏడాది మణిపూర్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఆమె పోటీకి దిగనున్నారు. తమ రాష్ట్రంలో రాజకీయంగా మార్పును తీసుకొస్తామని ఆమె తాజాగా విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. సైనిక దళాల ప్రత్యేకాధికారాల చట్టాలు లాంటివి ఇకపై సామాన్య పౌరులను ఇబ్బంది పెట్టలేవని పేర్కొన్నారు. అయితే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై చేసిన తాజా సర్వేలలో మణిపూర్ లో బీజేపీ అధికారంలోకి వస్తుందని వెల్లడైంది. షర్మిల పార్టీకి 6 శాతం మంది మాత్రమేనని మద్దతు పలుకుతున్నారని సర్వే పేర్కొంది.