: రాచరిక పోకడలు పోతున్న కేసీఆర్: జీవన్ రెడ్డి మండిపాటు
‘సీఎం కేసీఆర్ కు మంచి క్యాంపు కార్యాలయం కావాలి కానీ, పేదలకు మాత్రం ఇళ్లు వద్దా?’ అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేసీఆర్ రాచరిక పోకడలు పోతున్నారని, ఇప్పుడు కొత్త క్యాంపు కార్యాలయం నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ మండిపడ్డారు. పేదల ఆరోగ్యం, ఇళ్ల గురించి పట్టించుకోకుండా సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడం సబబు కాదన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న పోస్టులను తక్షణం భర్తీ చేయాలని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.