: పశ్చిమబెంగాల్‌లో కలకలం... తలలేని మహిళల మృతదేహాలను గుర్తించిన పోలీసులు
పశ్చిమబెంగాల్‌లో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. ఉత్తర మిడ్నాపూర్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళల తలలేని మృతదేహాలు, వాటి చుట్టూ చేతబడి చేసినట్లు గుర్తులు కనిపించాయి. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు మంత్ర తంత్రాల పేరుతో నరబలి జరిగినట్లు భావిస్తున్నారు. మృతదేహాల దగ్గర పువ్వులు, కుంకుమ, అగర్‌బత్తీలు ఉన్నాయని తెలిపారు. తమ్లక్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ తమలపాకుల తోటలో మొదట ఓ యువతి మృతదేహాన్ని తాము గుర్తించినట్లు, ఆ తరువాతి రెండు గంటల వ్యవధిలోనే ఇటువంటి మరొక మహిళ మృతదేహమే నందిగ్రామ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో గుర్తించామని పోలీసులు తెలిపారు. ఈ రెండు హత్యలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. వేరే ప్రాంతంలో మహిళలను చంపేసి మృతదేహాలను అక్కడ పడేశారా? అన్న కోణంలోనూ తాము దర్యాప్తు జరుపుతున్నట్లు, సదరు మహిళల వివరాలు ఇంకా తెలియలేదని చెప్పారు.