: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కు హైకోర్టులో షాక్
టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌కు హైకోర్టులో షాక్ తగిలింది. ఖమ్మంలో 2.5 కోట్ల విలువచేసే సరస్సు భూమిని పువ్వాడ ఆక్రమించారంటూ హైకోర్టులో సుధాకర్‌రావు అనే వ్యక్తి వేసిన పిటిషన్ ఈ రోజు విచారణకు వచ్చింది. వాదనలు విన్న హైకోర్టు ఆ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు జరపకూడదని స్టే విధించింది. వివాదాస్పద భూమిలో కట్టడాలపై వారం రోజుల్లోగా తమకు వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ తాను ఏ భూ కబ్జాలకూ పాల్పడలేదని మీడియాకు చెప్పారు. రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని, నిజానిజాలు కోర్టులో వెల్లడవుతాయని చెప్పారు. వివాదాస్పద భూమి సరస్సు భూమి కాదని ఆయన అన్నారు.