: నేటి సుప్రీం తీర్పుపై తమిళనాడు-కర్ణాటకలో ఉత్కంఠ.. తమిళనాడులో ఆందోళనలు
తమిళనాడు-కర్ణాటక రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న కావేరీ నదీ జలాల వివాదంపై ఈ రోజు సుప్రీంకోర్టు మరోసారి ఇరు పక్షాల వాదనలు విని తీర్పు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. అయితే, కేంద్రం, కర్ణాటక ప్రభుత్వ వైఖరికి నిరసనగా తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్న రైల్ రోకో కార్యక్రమాల్లో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు, రైతు సమాఖ్య కార్యకర్తలు ఈ రోజు కూడా తమ ఆందోళనని కొనసాగిస్తున్నారు. కావేరీ నదీ యాజమాన్య బోర్డు త్వరగా ఏర్పాటు చేయాలని రైతు సమాఖ్య కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.