: ముంబయి మేకర్ టవర్‌లోని 21వ అంతస్తులో మంటలు.. ఇద్దరి మృతి.. 11 మందిని రక్షించిన సిబ్బంది
ముంబయి మేకర్ టవర్‌లోని 21వ అంతస్తులో ఈ రోజు ఉదయం మంటలు చెలరేగి, వ్యాపించడంతో ఇద్దరు మృతి చెందారు. పలువురుకి గాయాలయినట్లు తెలుస్తోంది. భవనం నుంచి మరో 11 మందిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. మంటలను అదుపు చేయడానికి 8 ఫైరింజన్లు, ఆరు జంబో ట్యాంకర్లు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. ప్రమాదంలో గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఓ అంబులెన్స్‌ను కూడా తీసుకొచ్చారు. అపార్ట్‌మెంట్లలో ఉన్న వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తిగా దగ్ధమయినట్లు రెస్క్యూ సిబ్బందిలో ఒకరు మీడియాకు తెలిపారు.