: కాబోయే అత్తకు స్వయంగా వండి, వడ్డించిన నయనతార


అందం, అభినయం కలగలిపిన నటి నయనతార. అయితే, టాప్ హీరోయిన్ గానే కాకుండా, తన అఫైర్లతో మరింత ప్రచారం పొందింది ఈ అమ్మడు. శింబు, ప్రభుదేవాలతో ఆమె నడిపిన ప్రేమాయణంపై ఎంతో కాలం వరుసగా కథనాలు వెలువడ్డాయి. అయితే, తాజాగా యువ దర్శకుడు విఘ్నేష్ శివతో ఆమె ప్రేమాయణం నడుపుతున్న సంగతి తెలిసిందే. 'నానూ రౌడీదాన్' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొలకెత్తిందట. వీరి మధ్య డీప్ లవ్ ఎఫైర్ కొనసాగుతోందని అందరూ చెప్పుకుంటున్నారు. ఇది నిజమే అన్నట్టు... ప్రతి కార్యక్రమానికి వీరిద్దరూ కలిసే హాజరవుతున్నారు. అంతేకాదు, ఇద్దరూ చాలా చనువుగా ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వీరు మరింత సంచలనం రేకెత్తిస్తున్నారు. ఇటీవలే జరిగిన ఓ ఘటన ఆసక్తికరంగా ఉంది. విఘ్నేష్ తల్లిని తన ఇంటికి నయన్ ఆహ్వానించిందట. అంతేకాదు, ఆ సమయంలో తానే స్వయంగా వంట చేసి, కాబోయే అత్తగారికి వడ్డించిందట. అత్తగారికి మరింత దగ్గర కావడానికే నయనతార వంటింటి బాట పట్టిందని కోలీవుడ్ టాక్.

  • Loading...

More Telugu News