: అమెరికన్లు భారతీయ ఉద్యోగులతో పోటీపడుతున్నారు: అధ్యక్షుడు ఒబామా


ప్రస్తుతం అమెరికా ప్రజలు భారతీయ ఉద్యోగులతో పోటీ పడుతున్నారని, ఆ పోటీని తట్టుకునేందుకు దేశ విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేర్కొన్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో భారత్, చైనా ఉద్యోగులతో అమెరికన్లు నిత్యం పోటీపడుతున్నారన్నారు. మనం ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఉన్నామని, విద్యావంతులై ఇక్కడి వారితో పోటీ పడితే సరిపోదని వాషింగ్టన్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి అన్నారు. భారత్, చైనా యువతతోనూ పోటీపడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి ఆ దిశగా విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News