: భారత ప్రధాని మోదీ కసాయి.. నిప్పులు చెరిగిన పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో


పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) చైర్మన్ బిలావల్ భుట్టో భారత ప్రధాని నరేంద్రమోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయనో కసాయి అంటూ నిప్పులు చెరిగారు. ఆదివారం ఇస్లామాబాద్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో మాట్లాడిన ఆయన మోదీని ఉగ్రవాదిగా అభివర్ణించారు. కశ్మీర్‌లో జరుగుతున్న మానవహక్కుల ఉల్లంఘన నుంచి ప్రపంచం దృష్టిని మరల్చేందుకే మోదీ పాక్‌పై నిందారోపణలు చేస్తున్నారని ఆరోపించారు. కశ్మీరీలు తమ హక్కులను కూడా సాధించుకోలేని దుర్భర స్థితిలో ఉన్నారన్నారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాల వల్లే పాక్ బలహీనపడిందని పేర్కొన్నారు. ప్రభుత్వం ముందు తానుంచిన నాలుగు డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోకుంటే డిసెంబరు 27 నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతానని నవాజ్ ప్రభుత్వాన్ని బిలావల్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News