: ఏపీ తాత్కాలిక సచివాలయానికి కరెంటు కష్టాలు.. కాలిపోతున్న ఎలక్ట్రానిక్ పరికరాలు


ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయాన్ని కరెంటు కష్టాలు వెంటాడుతున్నాయి. వరుస అంతరాయాలతో ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతుండడంతో పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. మొదట్లో కొంచెంగా ఉన్న ఈ సమస్య సోమవారం పెద్దగా మారింది. నిన్న ఒక్కరోజే పదిసార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక్కడ జనరేటర్లు కానీ, ఇన్వర్టర్లు కానీ లేకపోవడంతో పనులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం, ఎలక్ట్రానిక్ పరికరాలు కాలిపోతుండడంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పని మధ్యలో ఉండగా కరెంటు పోవడంతో సిస్టంలో చేస్తున్న పని సేవ్ కావడం లేదని, సమచారం పూర్తిగా పోతోందని, లేదంటే కరప్ట్ అవడమో జరుగుతోందని ఉద్యోగులు పేర్కొన్నారు. తరచూ ఇలా జరగడంతో విలువైన, రహస్య సమాచారానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు. విద్యుత్‌ సరఫరాలో తీవ్ర అంతరాయం కారణంగా ఇప్పటికే ఓ జిరాక్స్ మిషన్ కాలిపోయిందని, మరో యంత్రం కూడా పనిచేయడం లేదని వివరించారు. ప్రభుత్వం ఈ విషయంలో దృష్టి సారించి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా చూడాలని కోరుతున్నారు.

  • Loading...

More Telugu News