: సౌమ్య కేసులో తీర్పును పునఃసమీక్షించాలన్న కట్జూకు ‘సుప్రీం’ ఆదేశాలు


కేరళకు చెందిన సౌమ్య అత్యాచారం, హత్య కేసులో తీర్పును పునఃసమీక్షించాలన్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కట్జూకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 11న సుప్రీంకోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ఈ తీర్పుకు సంబంధించి కట్జూ తన అభిప్రాయాలను వివరించాలని ఆదేశించింది. కాగా, 2011లో సౌమ్య హత్య జరిగింది. కేరళలోని ఒక మాల్ లో పని చేస్తున్న సౌమ్య తన విధులు ముగిసిన అనంతరం రైలులో ఇంటికి వెళుతోంది. గోవిందసామి అనే వ్యక్తి ఆమెపై దాడి చేసి, ఆమెను రైల్లో నుంచి కిందకి తోసేశాడు. తర్వాత అతను కూడా దూకేశాడు. తీవ్రంగా గాయపడ్డ సౌమ్యపై గోవిందసామి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే, ఈ సంఘటన జరిగిన ఐదు రోజులకు ఆమె ప్రాణాలు విడిచింది. ఈ కేసుకు సంబంధించి అతనికి కింది కోర్టు మరణశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో సరైన ఆధారాలు లేవని చెబుతూ మరణశిక్షను రద్దుచేసి, 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సెప్టెంబరు 15న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయితే, ఈ తీర్పుపై కట్జూ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించారు. ఈ తీర్పు సరిగా లేదని పునఃసమీక్షించాలని కోరారు. సౌమ్య తల్లి, కేరళ ప్రభుత్వం కూడా ఈ మేరకు ఒక పిటిషన్ ను సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

  • Loading...

More Telugu News