: అయోధ్య శ్రీరాముడిదే.. సందేహాలు వద్దు!: ఉమా భారతి


ఉత్తరప్రదేశ్‌లో వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రామజన్మ భూమి ‘అయోధ్య’ అంశం మరోసారి ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా మీడియాతో మాట్లాడిన కేంద్ర‌మంత్రి ఉమాభార‌తి అయోధ్య శ్రీరాముడికి చెందినదేనని ఉద్ఘాటించారు. ఈ అంశంలో ఎటువంటి సందేహాలు అవ‌స‌రం లేదని వ్యాఖ్యానించారు. కాగా, అయోధ్య స‌మీపంలో 25 ఎకరాల్లో శ్రీరామునికి సంబంధించిన ఓ మ్యూజియాన్ని నెల‌కొల్పాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణయం తీసుకుంది. రేపు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ ఆ ప్రాంతాన్ని సంద‌ర్శించ‌నున్నారు. ఈ అంశంపై ఆ రాష్ట్ర‌ అధికార పార్టీ సమాజ్‌వాదీతో పాటు ప్ర‌తిప‌క్ష‌ బీఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా ఉమాభార‌తి చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

  • Loading...

More Telugu News