: బలూచిస్తాన్ లో విరుచుకుపడ్డ పాక్ ఆర్మీ.. ముగ్గురి మృతి, పలువురికి గాయాలు
బలూచిస్తాన్ లో పాక్ ఆర్మీ ఉన్నపళంగా విరుచుకుపడింది. ఈ సంఘటనలో ఇప్పటివరకు ముగ్గురు పౌరులు మృతి చెందగా, పలువురికి గాయాలు అయ్యాయి. ఛత్తార్, షెరానీ, హోతీ, నసీరాబాద్ తదితర ప్రాంతాల్లో పౌరులపై పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడటమే కాకుండా ఇళ్లను కూడా తగులబెట్టింది. ఈ విషయాన్ని బలూచ్ రిపబ్లికన్ పార్టీ అధినేత షేర్ మహ్మద్ బుగ్తీ పేర్కొన్నారు. పాక్ ఆర్మీ విధ్వంసం సృష్టించిందని, మహిళలను, చిన్నారులను అపహరించుకు పోయిందని తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.