: హ్యాక్ అయిన భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుని ట్విట్టర్ ఖాతా.. డేటింగ్ సైట్లకు లింకు
భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుడు అరవింద్ సుబ్రహ్మణ్యం ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపి తన ఫాలోవర్స్‌కు క్షమాపణలు చెప్పుకున్నారు. ఎందుకంటే ట్విట్టర్లో ఆయన పలు పోస్టులు చేశారు. అయితే, ఆయన పంపిన ఆర్థికపరమైన అంశాల లింకులపై క్లిక్ చేస్తే అడల్ట్ డేటింగ్ సైట్లు ఓపెన్ అయ్యాయి. దీంతో ఆయన ఫాలోవర్లు షాక్ అయ్యారు. దీనిపై స్పందించిన అరవింద్ సుబ్రహ్మణ్యం వెంటనే వాటిని తొలగించి, తన ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేశారని తెలిపారు. తన ఫాలోవర్లకు అందుకే అలాంటి ట్వీట్లు వచ్చాయని చెప్పారు.