: మోసోల్ నగర స్వాధీనానికి భారీగా కదలిన ఇరాక్ సైన్యం.. సహకరించాలని ఆ ప్రాంత ప్రజలను కోరిన ఇరాక్ ప్రధాని


ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదుల‌పై పోరాటం జ‌రిపేందుకు ఇరాక్ క‌దిలింది. ఉగ్ర‌వాదులు స్వాధీనం చేసుకున్న‌ మోసోల్ నగరం చుట్టూ ఇరాక్ సైన్యంతో సహా కుర్దిష్ పెష్మెర్గా దళాలు, సున్నీ, షియా హషిద్ షాబీ పారామిలిటరీ సిబ్బంది మొహరించారు. ఈ విష‌యాన్ని ఆ దేశ ప్రధాని హైదర్ అల్ అబాదీ మీడియాకు అధికారికంగా తెలిపారు. ఇప్ప‌టికే ఉగ్ర‌వాదుల అధీనంలో ఉన్న 9 గ్రామాలను తాము స్వాధీనం చేసుకున్నామ‌ని చెప్పారు. ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టే క్ర‌మంలో మోసోల్ నగర ప్రజలు త‌మ‌కు సహకరించాలని కోరారు. ద‌ళాలు ఆ న‌గరాన్ని చుట్టుముట్టిన నేప‌థ్యంలో ప్ర‌జ‌లు ఉగ్ర శిబిరాల వైపు వెళ్ల‌కూడ‌ద‌ని నీనెవె ప్రాంత‌ గవర్నర్ హమ్మది అల్-సుల్తాన్ సూచించారు. ఆ దేశ రాజ‌ధాని బాగ్దాద్ కు 400 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆ న‌గ‌రంపై రెండేళ్ల క్రితం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడులు చేశారు. అనంత‌రం ఆ న‌గ‌రం మొత్తాన్ని త‌మ అధీనంలోకి తెచ్చుకున్నారు. మోసోల్‌ కేంద్రంగా త‌మ కార్య‌కలాపాలు జ‌రుపుతున్నారు. త్వరలోనే మోసోల్ ప్రాంతంలో త‌మ దేశ జెండాను ఎగురవేస్తామని ఇరాక్‌ ప్రధాని తెలిపారు.

  • Loading...

More Telugu News