: ఈ దీపావళి పండుగ జరుపుకోం!: అన్నా డీఎంకే నేతలు

అన్నా డీఎంకే వ్యవస్థాపక దినోత్సవాన్ని చాలా సాదా సీదాగా ఈరోజు నిర్వహించారు. చెన్నై, రాయపేటలోని అన్నాడీఎంకే హెడ్ క్వార్టర్స్ కు ఆ పార్టీ ప్రెసిడియమ్ చైర్మన్ ఇ.మధుసూదనన్, మంత్రులు పన్నీరు సెల్వమ్, దిండిగల్ కె.శ్రీనివాసన్, ఎడప్పడి కె.పళనిస్వామి, సెల్లురు కె రాజ్ వెళ్లారు. అన్నాడీఎంకే పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ విగ్రహానికి పూలదండలు వేశారు. అనంతరం పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా సావనీర్ ను విడుదల చేశారు. కాగా, తమిళనాడు సీఎం, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత కొన్నిరోజులుగా అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం విదితమే. ఆమె ఆరోగ్యంపై ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు, నేతలు, అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవం చాలా సింపుల్ గా నిర్వహించామని, టపాసులు పేల్చడం, స్వీట్లు పంచుకోవడం వంటివి చేయలేదని సీనియర్ నేతలు పేర్కొన్నారు. కనీసం బ్యానర్లు కట్టడం, డెకరేషన్ చేయడం వంటి వాటి జోలికి కూడా పోలేదని, ఈ ఏడాది దీపావళి పండగ కూడా చేసుకోమని అన్నాడీఎంకే నాయకులు ఈ సందర్భంగా చెప్పారు.

More Telugu News