: గుత్తా ఓ అద్దె మైకులాంటివాడు.. దీపం పురుగులాంటివాడు: భట్టి


టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తీవ్ర విమర్శలు చేశారు. సుఖేందర్ ఓ అద్దె మైకులాంటివాడని, దీపం పురుగులాంటివాడని విమర్శించారు. ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వాలిపోవడం గుత్తా నైజం అని అన్నారు. తనను విమర్శించే అర్హత గుత్తాకు లేదని మండిపడ్డారు. ఇదే సమయంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిపై కూడా విమర్శలు గుప్పించారు. నకిలీ విత్తనాలతో రైతులు నాశనమైపోతుంటే... వ్యవసాయ మంత్రి మాత్రం ఏమీ పట్టనట్టు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ నోట్ల కంటే నకిలీ విత్తనాల తయారీ చాలా ప్రమాదకరమని అన్నారు. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News