: కన్యాకుమారి పరిసరాల్లో అర్ధరాత్రి చక్కర్లు కొడుతూ కలకలం రేపిన డ్రోన్


అర్ధరాత్రి ఆకాశంలో ఎగురుతూ ఓ డ్రోన్ కలకలం రేపింది. ఈ ఘటన కన్యాకుమారి జిల్లాలోని సముద్ర తీర ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆకాశంలో అనుమానాస్పదంగా చక్కర్లు కొడుతున్న డ్రోన్ ను చూసిన స్థానికులు వెంటనే జిల్లా ఎస్పీకి సమాచారం అందించారు. వెంటనే ఆ ప్రాంతానికి పోలీసులు హుటాహుటీన చేరుకున్నారు. తమ సెల్ ఫోన్లలో స్థానికులు చిత్రీకరించిన వీడియోల ఆధారంగా డ్రోన్ ను కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే కోయంబత్తూరు, తిరునల్వేలి జిల్లాల్లో ఐఎస్ఐఎస్ సానుభూతిపరులను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో, ఈ డ్రోన్ కు ఉగ్రచర్యలతో సంబంధం ఉండవచ్చని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News