: రాష్ట్రపతి భవన్ తర్వాత సీఎం కేసీఆర్ నిర్మించనున్న ఇల్లే పెద్దది: టీడీపీ నేత రావుల సెటైర్


రాష్ట్రపతి భవన్ తర్వాత సీఎం కేసీఆర్ నిర్మించనున్న ఇల్లే పెద్దదని టీ-టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, 10 ఎకరాల్లో 150 గదులతో కేసీఆర్ ఇల్లు నిర్మించుకుంటున్నారని అన్నారు. సొంత సర్వేల ద్వారా తాను సూపర్ సీఎం అని కేసీఆర్ చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టడంలో ఆయన సూపర్ సీఎం అంటూ వ్యాఖ్యానించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని నాడు చెప్పిన కేసీఆర్, ప్రస్తుతం ఆ ఊసే ఎత్తడం లేదని, డబుల్ బెడ్ రూం పథకం గురించి మాట్లాడం లేదని మండిపడ్డారు. కల్తీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని రావుల డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News