: 20న విశాఖలో పెట్రోలియం వర్శిటీకి శంకుస్థాపన
విశాఖపట్టణం జిల్లా సబ్బవరంలో ఈ నెల 20న పెట్రోలియం వర్శిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి తదితరులు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా 219 పాఠశాలల్లో డిజిటల్ తరగతులను, సీతమ్మధార హుడా కాంప్లెక్స్ లో 9 ఐటీ సంస్థలను ప్రారంభించనున్నారు. అనంతరం స్వచ్ఛ భారత్ కార్యక్రమంపై ఆంధ్రా యూనివర్శిటీలో ప్రదర్శించే లఘు చిత్రాలను వీక్షిస్తారు.