: కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటాం!: ఆక్వా ఫుడ్ పార్క్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు
ఆక్వా పరిశ్రమ వల్ల కాలుష్యం ఏర్పడుతుందని పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తోన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలుషిత నీటిని శుద్ధి చేసి సముద్రంలోకి వదులుతామని అన్నారు. ఆక్వా ఫుడ్‌పార్క్ పై గ్రామస్తులతో మాట్లాడాలని తాను ఎమ్మెల్యేలకు సూచించినట్లు తెలిపారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు పరిశీలించారు. ఆ అంశంపై మాట్లాడుతూ... అనుమతుల విషయంలో జాప్యం జరిగితే నష్టపోతామని అన్నారు. సమగ్రంగా విధులు, అనుమతుల కోసం కేంద్రాన్ని తాము సంప్రదిస్తూనే ఉన్నామని తెలిపారు. పోలవరానికి త్వరగా అనుమతులు తీసుకోవాల్సిందేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టు చుట్టూ 30 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తాను ఆదేశించినట్లు పేర్కొన్నారు. పోలవరం చుట్టూ రేపటినుంచి పోలీస్ పికెటింగ్ ఉంటుందని చెప్పారు.