: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి 34 నుంచి 40 ఏళ్లకు పెంపు
ఏపీలో నిరుద్యోగ యువతకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితిని 34 నుంచి 40 సంవత్సరాలకు పెంచారు. ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల నోటిఫికేషన్లకు వయోపరిమితి పెంపు వర్తిస్తుంది.