: హైదరాబాద్‌లోని జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ 109 ప్రదక్షిణలు చేసి వినూత్న నిరసన
గ్రేటర్ హైదరాబాద్‌లో పలు సమస్యలపై నిరసనగా 'ప్రజా సమస్యల పరిష్కార వేదిక' సభ్యులు నగరంలోని జీహెచ్ఎంసీ కార్యాలయం చుట్టూ ఈ రోజు ప్రదక్షిణలు చేశారు. సదరు కార్యాలయం చుట్టూ మొత్తం 109 ప్రదక్షిణలు చేసిన సభ్యులు.. జీహెచ్ఎంసీ తీరుపై మండిపడ్డారు. జీహెచ్ఎంసీ 5 కోట్ల రూపాయలు వెచ్చించి, ఆధునిక బయో టాయిలెట్లు నిర్మించిందని.. కానీ, అవి వృథాగా కనిపిస్తున్నాయని వారు అన్నారు. అవి ప్రజలు వినియోగించుకునేట్లు చూడాలని వారు డిమాండ్ చేశారు.