: జయలలిత ఆరోగ్యంపై కామెంట్.. కొట్టుకున్న అన్నాడీఎంకే కౌన్సిలర్, డీఎంకే కార్యకర్త


తమిళనాడు సీఎం, జయలలిత ఆరోగ్య పరిస్థితి గురించి అన్నాడీఎంకే, డీఎంకే పార్టీ నాయకులు ఘర్షణ పడ్డారు. కోయంబత్తూరులో జరిగిన ఈ సంఘటనలో అన్నాడీఎంకే కౌన్సిలర్ జేమ్స్ రాజ్, డీఎంకే కార్యకర్త లింగదురై గాయపడ్డారు. వీళ్లిద్దరూ గొడవపడటమే కాకుండా పరస్పరం కొట్టుకున్నారు. గాయాలపాలైన వీరిద్దరూ పొలాచి ఆసుపత్రిలో చేరారని పోలీసులు పేర్కొన్నారు. మద్యం సేవించి ఉన్న లింగదురై జయలలిత ఆరోగ్యంపై గత రాత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో, అటుగా వెళ్తున్న జేమ్స్ ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించాడు. దీంతో, వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసిందని పోలీసులు చెప్పారు. వీళ్లిద్దరూ పరస్పరం దాడి జరిగిందంటూ ఫిర్యాదులు చేసుకున్నారని, పొలాచి ఆసుపత్రిలో చేరారని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News