: పాక్ కు వ్యతిరేకంగా తీసుకునే ప్రతి చర్యలో మోదీకి నా మద్దతు ఉంటుంది: నితీష్ కుమార్


బద్ధ శత్రువైన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు లభించింది. పాక్ పై భారత సైన్యం నిర్వహించిన సర్జికల్ దాడులను నితీష్ పూర్తిగా సమర్థించారు. అంతేకాదు, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా మోదీ తీసుకునే ఏ చర్యకైనా తన సంపూర్ణ మద్దతు ఉంటుందని... అయితే, సర్జికల్ దాడులను రాజకీయ అవకాశవాదానికి వాడుకోవద్దని చెప్పారు. ఈ రోజు రాజ్ గిరిలో జరిగిన ఓ బహిరంగసభలో నితీష్ మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలు చేశారు. పాక్ కు వ్యతిరేకంగా ఏ చర్యలైనా తీసుకోండి... కానీ, ఆ దేశానికి ప్రేమ లేఖలు రాయడం మాత్రం మానుకోండంటూ మోదీకి నితీష్ సూచించారు. పాక్ పై కఠిన వైఖరిని అవలంబించాలని అన్నారు. నరేంద్ర మోదీ దేశానికి నాయకుడిగా వ్యవహరించాలని, బీజేపీకి నాయకుడిలా కాదని తెలిపారు. సర్జికల్ దాడుల నేపథ్యంలో, ప్రధాని మోదీని కీర్తిస్తూ బీజేపీ పోస్టర్లు అతికించడాన్ని ఆయన తప్పుబట్టారు.

  • Loading...

More Telugu News