: కాకరకాయ కావాలంటున్న కరీనా కపూర్!
2002లో బాలీవుడ్ లో అడుగుపెట్టనప్పటి నుంచి ఇంత వరకు వెనుదిరిగి చూసుకోలేదు అందాల భామ కరీనా కపూర్. ఎన్నో సినిమాలు సూపర్ హిట్ కావడం వెనుక కరీనా అందం, అభినయం ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లాడిన తర్వాత కూడా సిల్వర్ స్క్రీన్ పై ఆమె మెరుపులు తగ్గలేదు. ఇప్పటికీ కరీనా అంటే పడి చచ్చే అభిమానులు కోట్లలో ఉన్నారు. కరీనా గురించి కొన్ని ఆసక్తికర విషయాలను ఓ సారి తెలుసుకుందాం. * ఈ 'ఉడ్తా పంజాబ్' హీరోయిన్ కు యోగా అంటే చాలా ఇష్టం. అంతేకాదు, ప్రతి రోజు 50 సూర్యనమస్కారాలు చేస్తుంది. కానీ, ఒకానొకప్పుడు యోగా అంటేనే అసహ్యించుకునేది. గతంలో ఒకసారి యోగా ప్రాక్టీస్ మొదలుపెట్టి నెల రోజుల్లోనే మానేసింది. * బెబోకు ఉన్న ఒకే ఒక చెడు అలవాటు గోళ్లు కొరకడం. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, గోళ్లు కొరకడం ఒక్కటే తనకున్న చెడు అలవాటు అని స్వయంగా తెలిపింది. * ఏదైనా సాధించగలననే ఆత్మవిశ్వాసం కరీనా సొంతం. తనకు అప్పజెప్పిన పనికి పూర్తి స్థాయిలో న్యాయం చేయడం ఆమె బలం. ఆరేళ్ల వయసు నుంచే అనుకున్నది సాధించడం తనకు ఒక అలవాటుగా మారిందని కరీనా చెప్పింది. * కరీనా ప్రస్తుతం గర్భవతి. డిసెంబర్ లో ఆమెకు డెలివరీ కానుంది. అయితే, తనకు పుట్టే పిల్లల కంటే తన సోదరి కరిష్మా పిల్లలే తనకు ముఖ్యమని... వాళ్ల తర్వాతే తనకు తన పిల్లలు అని చెప్పింది. * ప్రెగ్నెన్సీ సమయంలో కరీనాకు కాకరకాయ తినాలనే కోరిక ఎక్కువగా కలుగుతోందట. * తన భర్త సైఫ్ తో కలిసి ఏనాటికైనా దక్షిణ ఫ్రాన్స్ లో సెటిల్ కావాలనేది కరీనా కోరిక. * సింపుల్ మీల్స్ తీసుకోవడం ఈ భామకు ఇష్టం. రోటీ, దాల్, రైస్, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటుంది. ఇంట్లో చేసిన దాల్ రైస్ అంటే చాలా ఇష్టం. థాయ్ ఫుడ్ అన్నా కరీనాకు చాలా ఇష్టం. * బూట్ల కలెక్షన్ ఆమె హాబీ. రకరకాల బూట్లు సేకరించడమే కాదు, అందరికి చూపించడం కూడా ఆమెకు ఇష్టం.