: కృష్ణా జిల్లాలో దారుణం... ప్రియుడితో కలసి కన్న కొడుకును కడతేర్చిన తల్లి!


తన ఆనందానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో అభంశుభం ఎరుగని పసికందును తన ప్రియుడితో కలసి హత్య చేసి కాలువలో పారేసిందో కామాంధురాలు. కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల్లోకి వెళితే, రేఖ అనే యువతి తన ఐదేళ్ల కుమారుడు, రాజారావు అనే ప్రియుడితో కలసి మూడు నెలల క్రితం మహారాష్ట్ర నుంచి కంకిపాడు ప్రాంతానికి వచ్చింది. తన అక్రమ బంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో బిడ్డను ఇద్దరూ కలసి హత్య చేసి కాలువలో పడేశారు. బిడ్డ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో, రేఖను అదుపులోకి తీసుకుని విచారిస్తే, అసలు విషయం వెల్లడైంది. రాత్రుళ్లు గుక్క తిప్పుకోకుండా ఏడుస్తూ నిద్రాభంగం కలిగిస్తుండటంతోనే తన బిడ్డను హత్య చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆమె చెప్పడంతో పోలీసులే విస్తుపోయారు. నిందితులను అరెస్ట్ చేశామని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News