: చిరంజీవి కుమార్తె సుస్మిత తనను చక్కగా రెడీ చేసిందని చెబుతూ ఫోటో పంచుకున్న రాయ్ లక్ష్మి
వీవీ వినాయక్ దర్శకత్వం వహిస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'లో ఓ ఐటమ్ సాంగ్ లో నర్తించిన నటి రాయ్ లక్ష్మి తన ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ఈ పాట కోసం చిరంజీవి కుమార్తె సుస్మిత తననెంతో అందంగా అలంకరించిందని చెబుతూ సెట్స్ లో దిగిన ఓ ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. తన కల నిజమైందని, లెజండ్ చిరంజీవితో కలసి నటించడాన్ని తానెంతో గర్వంగా ఫీల్ అవుతున్నానని చెప్పుకుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్న సంగతి తెలిసిందే.